గురించి

మాతృవాణి- అమ్మ యొక్క దివ్య వాణి- మాతా అమృతానందమయి మఠం యొక్క పతాక ప్రచురణ

 
1984లో పవిత్రమైన అమ్మ పుట్టిన రోజు పండుగ సందర్భముగా, మెదటి ప్రచురణ ఆవిష్కరింపబడినది. అమ్మ సందేశమును, అమ్మ భక్తులకు అందిచాలనే ఉద్దేశముతో, ఈ పత్రిక స్థాపించబడినది. నేడు ప్రపంచ వ్యాప్తముగా లక్షల సంఖ్యలో ఈ పత్రికను అమ్మ బిడ్డలు చదువుతున్నారు. నేడు ప్రపంచ వ్యాప్తముగా అన్ని ఖండాలలో మాతృవాణి చందాదారులు ఉండటం, అమ్మ సందేశములను చదవడం, అమ్మపై ఉన్న గౌరవ మర్యాదలకు తార్కాణం.


ఈ పత్రికకు భూమండలం యొక్క అన్ని ఖండాలలో ఉన్న దేశవాసులు భక్తి, శ్రద్ధలతో చందాదారులుగా కావడానికి మూలకారణం, అమ్మ తమ నిస్వార్థ ప్రేమను ప్రపంచవ్యాప్తంగా అందరిపైన ప్రసరింప జేయడమే.


ఈ పత్రికకు అన్ని దేశాలలో మంచి ఆధరణ లభించడానికి కారణం, అమ్మే! నిస్వార్ధ ప్రేమకు మరియు కరుణకు ప్రతిరూపం అమ్మ!. అమ్మ బోధనలు ఎంతో అమూల్యమైనవి, ఎంత లోతైనవో; అంత విశాలమైనవి. అన్ని కాలములకు వర్తించేవి.


మాతృవాణి పత్రికలోని పేజీలు, వినయపూర్వకమైన భక్తి భావనలతో నిండిన భోదనలతోను, ఆధ్యాత్మిక అనుభవాలతో కూడిన వ్యాసములతోను, నిండి ఉంటాయి. అంతేకాక ప్రతి సంచికలోను అమ్మ యొక్క దేశ విదేశీ పర్యటనల వివరాలు, మరియు ప్రపంచవ్యాప్తంగా విస్థరించి ఉన్న, అమ్మ యొక్క సంస్థల ద్వారా జరుపుచున్న ఆధ్యాత్మిక, ధార్మిక, ప్రజాహిత కార్యక్రమాల వివరాలు, ఆయా కార్యక్రమాల్లో జరిగే నవీకరణల వివరాలతో నిండి ఉంటాయి.


గత మూడు దశాబ్దములుగా జరుగుతున్న దివ్య చరిత్రను మరియు దైవ కార్యమును నమోదుచేసే ఒక ప్రబంధము మాతృవాణి. దీని విలువ వెలకట్టలేము. కొన్ని పాత సంచికలు మీ కొరకు అందిస్తున్నాము. ఈ దివ్య వాణి మిమ్ములను ఉద్ధరించు గాక!